వైకాపా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ?

Written By Siddhu Manchikanti | Updated: June 12, 2019 13:28 IST
వైకాపా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ?

వైకాపా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ?
 
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జాతీయ పార్టీలకు దీటుగా వైకాపా పార్టీ కి పార్లమెంటు స్థానాలు అధికంగా వచ్చాయి. ఇటువంటి క్రమంలో తాజాగా వైసీపీ పార్టీ గురించి జాతీయ మీడియా ఛానల్ లో సంచలన కరమైన కథనం ప్రసారం అవుతుంది. అదేమిటంటే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ వైకాపా పార్టీ కి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఆ కథనం యొక్క సారాంశం.
 
కేంద్రంలో కీలకమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి కేటాయించిందని వార్త రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇటీవల జరిగినటువంటి లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 22 స్థానాలను సాధించుకొని లోక్ సభలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. అయితే కేంద్రంలో అధికారిక పార్టీకి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని గతకొంతకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే ఈ విషయం మీద పలు చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. కేంద్రంలో ఎన్డీయే కి భాగస్వామ్యమైన జేడీయూ గత కొంత కాలంగా బీజేపీ పార్టీ కి దూరంగానే ఉంటుంది. దీంతో జేడీయూ స్థానాన్ని వైసీపీ తో భర్తీ చేయాలనీ బీజేపీ అనుకుంటున్నదని సమాచారం. మరి బీజేపీ ఇచ్చిన ఆఫర్ కి వైసిపి పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Top