జగన్ వస్తే పెట్టుబడులు రావు అన్నవాళ్లు దయచేసి ఇటు రండి ఒకసారి !
జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యర్థి పార్టీల నాయకులు జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమైపోతుందని అనేక కేసులు ఉన్న జగన్ ని చూసి చాలామంది పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని కామెంట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ వేరేలా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది పెట్టుబడిదారులు జగన్ వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో 2500 కోట్ల పెట్టుబడితో దాదాపు తొమ్మిది వందల ఉద్యోగాలను సృష్టించడంలో జగన్ సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. స్థానిక ఉద్యోగాల కల్పణలో భాగంగా అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీస్ తో ఏపీ ప్రుత్వం తాజాగా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం కింద 2వేల 500కోట్ల భారీ ప్రాజెక్ట్‌ను అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీస్ ఏపీలో ప్రారంభించబోతోంది. ఏపీ పర్యావరణ శాఖ అనుమతి లభించడంతో కర్నూల్‌లోని పెట్నికోటె గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించబోతున్నారు. దీని ద్వారా 900 మంది లబ్దిపొందబోతున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 900 మందికి ఉద్యోగావకాశాలు కలగబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో ఏపీలో జగన్ ఏసీఎ అయిన తరువాత ఏపీలో ప్రారంభం కాబోతున్న తొలి భారీ పరిశ్రమగా దీన్ని చెబుతున్నారు. జగన్ ఆరంభం అదిరిందని, దీంతో ఉద్యోగాల కల్పిణతో పాటు రాష్ట్రానికి మంచి గుడ్ విల్ వున్న కంపెనీని తీసుకొచ్చారని ఇప్పటికే ప్రశంసలు మొదలుపెట్టారు. మొత్తంమీద ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పెట్టుబడులు చూస్తుంటే జగన్ వస్తే పెట్టుబడులు రావు అన్న వాళ్ళకి నోరెళ్లబెట్టినటు అయిందని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.