కోడెల ఫ్యామిలీ టార్గెట్ గా కేసులే కేసులు .. అరస్ట్ కి అంతా సిద్ధం ?

కోడెల ఫ్యామిలీ టార్గెట్ గా కేసులే కేసులు .. అరస్ట్ కి అంతా సిద్ధం ?

కోడెల ఫ్యామిలీ టార్గెట్ గా కేసులే కేసులు .. అరస్ట్ కి అంతా సిద్ధం ?
 
టిడిపి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల కుటుంబంపై అవినీతి ఆరోపణలు మరియు ఫిర్యాదులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కోడెల శివ ప్రసాద్ కుమారుడు మరియు కుమార్తెలు తమని బెదిరించి డబ్బులు వసూలు చేసే వారిని చాలామంది నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వ్యాపారవేత్తలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఆయన కూతురు పూనాటి విజయలక్ష్మి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
 
భూకబ్జా లు, సెటిల్ మెంట్ లు , ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూళ్ళు, బిల్డింగ్ లు కట్టుకోవాలంటే కప్పం చెల్లించాలని ఇలా అనేక రకాలుగా దోపిడిలకు పాల్పడ్డారని.. దీనికి కే ట్యాక్స్ అని వైసీపీ నేతలు ప్రచారంచేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో కే టాక్స్ పేరుతో కోడెల కుటుంబం ప్రజలను దోచుకుంటుందని జగన్ పాదయాత్ర సమయంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఆ తరువాత వైసిపి తో పాటు ప్రతిపక్ష పార్టీలు కే టాక్స్ ను బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు వైసిపి అధికారం లోకి రావడంతో ఒకే రోజు.. కోడెల కుమార్తె, కుమారుడుపై కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ప్రజలను దారుణంగా మోసం చేసిన కోడెల ఫ్యామిలీని గట్టిగానే అధికార పార్టీ వైసీపీ టార్గెట్ చేసి కేసుల మీద కేసులు పెడుతున్నట్లు తెలుస్తోంది.


Tags :


Top