జగన్ ని చూసి కెసిఆర్ చాలా నేర్చుకోవాలి అంటున్న ఆ పార్టీ నేతలు..!

జగన్ ని చూసి కెసిఆర్ చాలా నేర్చుకోవాలి అంటున్న ఆ పార్టీ నేతలు..!

జగన్ ని చూసి కెసిఆర్ చాలా నేర్చుకోవాలి అంటున్న ఆ పార్టీ నేతలు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటువంటి క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య తగాదా పెట్టాలనో, లేక ఎపి ముఖ్యమంత్రి జగన్ పై అబిమానమో తెలియదు కాని, కాంగ్రెస్ నేత టి.జీవన్ రెడ్డి ఈ సి.ఎమ్ ల మద్య పోల్చి మాట్లాడారు. ఉద్యోగులకు ఐఆర్, ఆర్టీసీ, విద్య, ఇళ్ల నిర్మాణం పట్ల పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్‌ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని అమలు చేస్తున్నారు.
 
పక్క రాష్ట్ర పాలన చూసైనా కేసీఆర్ కళ్లు తెరుస్తాడని ఆశిస్తున్నాని ఆయన అన్నారు. జగన్ తీసుకు వస్తున్న సంస్కరణలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు ఇవ్వడంతో పాటు.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరిచేలా ఉన్నాయి. అమ్మఒడి వంటి వాటిని చేపట్టారని అన్నారు. తండ్రి బాటలో జగన్ నడుస్తున్నారని ఆయన అన్నారు. మొత్తంమీద జగన్ను చూసి కెసిఆర్ నేర్చుకోవాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.


Tags :


Top