అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న మహిళ ఉప ముఖ్యమంత్రి..!

అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న మహిళ ఉప ముఖ్యమంత్రి..!

అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న మహిళ ఉప ముఖ్యమంత్రి..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. స్పీకర్ ఎన్నిక తర్వాత మాట్లాడిన సభ సభ్యులు చాలా మంది స్పీకర్ ఎన్నిక పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాం ని ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఉన్న సభ్యులు స్పీకర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ ను అభినందించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై ఆమె భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.
 
ముఖ్యమంత్రి జగన్ ఒక గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. 'నేను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మొదటిసారి ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అడుగుపెట్టాను. అయితే ఈ సభలో విలువలు, విశ్వసనీయతను గత సభలో చూడలేకపోయాం. రాజ్యాంగ విలువలు దెబ్బతీసిన తీరు చూసి బాధపడ్డాను. ఇదే సభలో అప్పుడు చిన్న వయసులో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన తీరు చూసి గర్వపడ్డాను. ఏ సభలో అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో అదే సభను గొప్పగా నడిపిస్తారని ఆశిస్తున్నాను. తమ్మినేని సీతారామ్ బిసి వర్గానికి చెందిన సీనియర్ నేత ,ఆయన అన్ని విదాలుగా అర్హుడు"అని ఆమె అన్నారు.Top