స్పీకర్ ఎన్నిక సమయంలో సంప్రదాయాలు పాటించాని చంద్రబాబు..!

Written By Siddhu Manchikanti | Updated: June 14, 2019 10:20 IST
స్పీకర్ ఎన్నిక సమయంలో సంప్రదాయాలు పాటించాని చంద్రబాబు..!

స్పీకర్ ఎన్నిక సమయంలో సంప్రదాయాలు పాటించని చంద్రబాబు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ్మినేని సీతారాం ని స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత సభాస్థలిలో హౌస్ ఆఫ్ ద లీడర్ తో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కావలసిన క్రమంలో చంద్రబాబు రాకపోవడం రెండో రోజు అసెంబ్లీ సమావేశాలలో పెను దుమారాన్ని రేపింది. ఎపి శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ ఎన్నికయ్యారు.
 
ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన వేయనందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెమ్ స్పీకర్ చిన అప్పలనాయుడు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన సభా నాయకుడు, ఇతర పార్టీల నేతలు వచ్చి సభాపతి స్థానం అలంకరించాలని కోరారు.ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ ,మంత్రులు లేచి సీతారామ్ ను వేదికపైకి తీసుకు వచ్చారు. సీతారామ్ ను జగన్ ఆలింగనం చేసుకున్నారు. అయితే తెలుగుదేశం పక్షాన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా రాకుండా, ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులను పంపించడంతో సభలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తప్పు పట్టడం జరిగింది.
Top