నేను తగ్గను అంటున్న చంద్రబాబు…!

Written By Siddhu Manchikanti | Updated: June 14, 2019 10:26 IST
నేను తగ్గను అంటున్న చంద్రబాబు…!

నేను తగ్గను అంటున్న చంద్రబాబు…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు స్పీకర్ ఎన్నిక తర్వాత తొలిసారి ప్రసంగించారు ప్రతిపక్షనేత చంద్రబాబు. తమ్మినేని సీతారాం ని స్పీకర్ గా ఎన్నుకోవడం అభినందనీయమని ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారని దివంగత ఎన్టీఆర్ చొరవతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు తమ్మినేని సీతారాం ని పొగడ్తలతో ముంచెత్తారు.
 
అయితే ఈ దశలో చంద్రబాబు సౌండ్ తగ్గిందని కొందరు అదికార పక్ష ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించగా, వెంటనే ఆయన అందుకుని తన సౌండ్ ఏమీ తగ్గలేదని, తనకు అధికారం, ప్రతిపక్షం కొత్తకాదని ఆయన అన్నారు. పోరాటాలు చేయడానికి వెనుకాడేది ఉండదని అన్నారు. అదికారం మీకే కొత్తదని ఆయన అన్నారు. మీ ఆధ్వర్యంలో మైక్ సరిగా లేదని, అందువల్లే సౌండ్ తగ్గి వినిపించిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం నుంచి నాలుగో స్పీకర్ గా తమ్మినేని ఉన్నారని, ఆ జిల్లా స్పీకర్ ల జిల్లాగా ఉందని ఆయన అన్నారు. తమ్మినేని రాజకీయ నేపద్యం కూడా వివరిచారు. కాగా ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలకు, వ్యాఖ్యలకు చంద్రబాబు సమాదానం ఇవ్వలేదు.
Top