సంచలన బ్రేకింగ్: అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యే కి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!

Advertisement

by Siddhu Manchikanti | June 14, 2019 10:33 IST
Follow Xappie
సంచలన బ్రేకింగ్: అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యే కి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంచలన బ్రేకింగ్: అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యే కి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!
 
నెల్లూరు రాజకీయాలలో వైసీపీ పార్టీలో కీలకంగా ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగనే తనకు దేవుడు అంటూ ప్రమాణ స్వీకారం చేయడం అసెంబ్లీలోనే సంచలనం సృష్టించింది. ఏపీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా దగ్గరగా ఉండే కోటం శ్రీధర్ రెడ్డి తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.
 
విషయం ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడినప్పుడు బాగున్నావా ? అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. బుచ్చయ్య చౌదరిని పలకరించారు. ఆ సమయంలో కోటంరెడ్డికి బుచ్చయ్య కూడా శుభాకాంక్షలు చెప్పారు ఆ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ ‘అన్నా.. ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారు... ఇప్పుడు మేమొచ్చాం. అధికార పక్ష ఎమ్మెల్యేలుగా మేమెలా వ్యవహరించాలో చెప్పన్నా..’ అని కోటంరెడ్డి అన్నారట. బుచ్చ్య నవ్వుతూ సమాదానం చెప్పకుండా ఉండిపోయారు. తిరిగి కోటంరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో రికార్డు పుస్తకాలు తెప్పించాను. గతంలో ప్రతిపక్షాన్ని మీరెన్ని తిట్లు తిట్టారో చూశాను. వాటికి మరింత క్రీమ్‌ రాసి ఈ ఐదేళ్లూ మీపై సంధిస్తాం’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారట. అదండి సంగతి. మొత్తంమీద వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.


Advertisement


Advertisement

Top