బిగ్ బ్రేకింగ్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో డీల్ సెట్ చేసుకుంటున్న చంద్రబాబు…?

Written By Siddhu Manchikanti | Updated: June 15, 2019 10:03 IST
బిగ్ బ్రేకింగ్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో డీల్ సెట్ చేసుకుంటున్న చంద్రబాబు…?

బిగ్ బ్రేకింగ్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో డీల్ సెట్ చేసుకుంటున్న చంద్రబాబు…?
 
2014 ఎన్నికల్లో మోడీ ప్రధాని అవటానికి వెనుక వుండి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వ్యూహాలను వేసి మోడీ ప్రధాని అవ్వటానికి గల కారణాలలో ప్రధమ కారణమయ్యారు ప్రశాంతి కిషోర్. ఆ తర్వాత కొన్ని పార్టీలకు పనిచేసిన ప్రశాంతి కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలకు గాను వైసీపీ అధినేత జగన్ కి ఎన్నికల వ్యూహకర్తగా మారడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రశాంతి కిషోర్ ఆధ్వర్యంలో వైసీపీ అధినేత జగన్ టిడిపి పార్టీ ని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి రావడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ తో టచ్లో ఉన్నట్లు రాబోయే ఎన్నికలకు డీల్ సెట్ చేసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
 
జాతీయ మీడియా ఛానల్ లోను మరియు సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. రహస్యంగా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించారని ప్రచారం సాగింది. టీడీపీకి చెందిన పలువురు నేతలు చంద్రబాబు పీకేను సంప్రదించాలని సలహా ఇచ్చారనే సమాచారం కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఆ ప్రచారంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టత ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్‌ను టీడీపీ సంప్రదించినట్లు వస్తున్న వార్తలు అన్నీ పుకార్లేనని ఆయన చెప్పారు. అసలు తాము ఇంతవరకూ ఎవర్నీ సంప్రదించలేదని ఆయన అన్నారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
Top