ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ - జగన్ హ్యాపీ !

Written By Siddhu Manchikanti | Updated: June 15, 2019 10:14 IST
ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ - జగన్ హ్యాపీ !

ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ - జగన్ హ్యాపీ !
 
40 సంవత్సరాల అనుభవం అంటూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని రెండు లక్షల కోట్ల అప్పులు పాలు చేయడం జరిగింది. దీంతో నూతనంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి లో సంక్షేమ రంగంలో పరుగులు తీయించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కంటే పరిణితి గా జగన్ ఆలోచిస్తూ ఎక్కడా కూడా కేంద్ర పెద్దలతో విమర్శలకు తావు ఇవ్వకుండా సఖ్యతగా మెలుగుతూ ఏపీకి రావాల్సిన నిధులను రాబట్టుకుంటూ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
 
ఇప్పటికే పోలవరానికి సంబంధించి నిధులను 3వేల కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు నిధులను నాబర్డ్ నుంచి రిలీజ్ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనురుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇప్పుడు తాజాగా ఏపీలో ఉపాధిహామీ పథకానికి సంబంధించి రావాల్సిన పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఏపీకి రావాల్సిన మొత్తం నిధుల్లో ప్రస్తుతం రూ.708 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2500 కోట్లకు రూ.708 కోట్లు విడుదల చేసింది. మొత్తంమీద ఆర్థికంగా కష్టాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం నిధులను విడుదల చేయటంతో ఇది ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ హ్యాపీ అయ్యే న్యూస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top