నీతి ఆయోగ్ సమావేశంలో ఇరగదీసిన జగన్ స్పీచ్..!

Written By Siddhu Manchikanti | Updated: June 16, 2019 11:03 IST
నీతి ఆయోగ్ సమావేశంలో ఇరగదీసిన జగన్ స్పీచ్..!

నీతి ఆయోగ్ సమావేశంలో ఇరగదీసిన జగన్ స్పీచ్..!

 
ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది వంటి విషయాలను నిర్మొహమాటం గా కేంద్ర పెద్దలకు అర్థమయ్యేరీతిలో తెలియజేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై నీతి ఆయోగ్ సమావేశంలో సమర్దంగా తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. ఎపి విభజన వల్ల బాగా నష్టపోయిందని ఆయన తెలిపారు.హైదరాబాద్ ఆర్దికంగా అబివృద్ది చెందిన నగరం కాగా, ఆ స్థాయిలో ఎపిలో ఒక్క నగరం లేదని ఆయన అన్నారు.ఉద్యోగ,ఉపాది అవకాశాలు లేక ఎపి యువత వలస పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చాలని అన్నారు. ఎపి కి విభజన సమయంలో 99 వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు అది 2.58 లక్షల కోట్లకు చేరాయని ఆయన చెప్పారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కాగా, ఎపి లోటు రాష్ట్రం అని, ఆర్దిక సంఘం 23 వేల కోట్ల లోటు లో ఉన్నట్లు ఆర్దిక సంఘం తెలిపిందని, కాని ఇది 66 వేల కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు.కాగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ ప్రత్యేక హోదాపై తీర్మానం చేసిందని, దానిని రద్దు చేయలేదని ఆనాటి ప్లానింగ్ కమిషన్ సభ్యుడు అబిజిత్ సేన్ రాసిన లేఖను కూడా జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించి ఆ కాపీని జత చేశారు. మొత్తం మీద ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశం లో స్పీచ్ అదిరిపోయేటట్లు ఇచ్చారు.
Top