టి కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్లిపోతున్న సంచలన నేత..?

Written By Siddhu Manchikanti | Updated: June 16, 2019 11:04 IST
టి కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్లిపోతున్న సంచలన నేత..?

టి కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్లిపోతున్న సంచలన నేత..?

 
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బ తినడంతో దేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నాయకులు చాలామంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎవ్వరూ ఊహించని విధంగా అత్యధిక మెజారిటీ స్థానాలు గెలిచి తిరిగి అధికారంలోకి రావడంతో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు బిజెపి పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయినట్టు తెగ వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిక దాదాపు ఖాయమైనట్లే ఉంది. ఆయన సోదరుడు భువనగిరి ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను పార్టీ మారబోనని చెప్పిన రెండు రోజులకే రాజగోపాలరెడ్డి సంచలన వ్యఖ్యలు చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ కి బిజెపినే ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. పార్టీ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకొనే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. . దేశమంతా భాజపావైపే చూస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలైందని ఆరోపించారు. భాజపాలో చేరడంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.ఇప్పుడు పిసిసి అద్యక్ష బాద్యతలు అప్పగించినా ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
Top