జగన్ మనసు గెలుచుకుని కానిస్టేబుల్ నుండి ఎమ్మెల్యే గా ఎదిగిన నేత..!

జగన్ మనసు గెలుచుకుని కానిస్టేబుల్ నుండి ఎమ్మెల్యే గా ఎదిగిన నేత..!

జగన్ మనసు గెలుచుకుని కానిస్టేబుల్ నుండి ఎమ్మెల్యే గా ఎదిగిన నేత..!

 
ఏపీ సీఎం వైసిపి పార్టీ అధినేత జగన్ ఏ మనిషినైనా నమ్మరు అంటే ఆ మనిషి స్థితిగతులను మారిపోతాయని చాలా సందర్భాలలో రుజువైంది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడిగా ఎన్నికలలో పోటీచేసి ఎంపీగా గెలిచిన నందిగామ సురేష్ విషయంలో కూడా ఇదే జరిగింది. జగన్ పై బురదజల్లడమే లక్ష్యంగా అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ.. వైసీపీ పార్టీలో చేరకముందే జగన్ దృష్టిలో పడకముందే నందిగామ సురేష్ పై భౌతికంగా దాడులు చేసి మానసిక హింసలు పెట్టిన వాటినన్నిటిని తట్టుకుని నిలబడి రాజధాని పంటలు కాల్చిన విషయంలో అన్యాయంగా జగన్ పై కేసులు పెట్టాలని చూసినా అధికార పార్టీ టీడీపీకి లొంగని నందిగామ సురేష్ పోరాట పటిమ మరియు వ్యక్తిత్వం తెలుసుకొని ముగ్ధుడైన జగన్...తనకోసం నిలబడ్డా నందిగామ సురేష్ ని ఇప్పుడు పార్లమెంటులో కూర్చోబెట్టారు. తన పార్టీ తరఫున ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు జగన్. గతంలో ఫోటోగ్రాఫర్ గా జీవనం కొనసాగించే నందిగామ సురేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో కానిస్టేబుల్ గా వ్యవహరించిన ఒక వ్యక్తి ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చుంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు తోగూరు ఆర్థర్. ఈయన ఇంతకు ముందు ఒక పోలీస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ మార్షల్ గా పనిచేశారు. అసెంబ్లీలో గొడవచేసిన వాళ్ళను బలవంతంగా బయటకు తీసుకెళ్లడం చేశేవారు. ఈ మధ్యలో జగన్ తో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఆ అనుబంధాన్ని అలాగే కొనసాగిస్తూ నందికొట్కూరు ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు.Top