చాన్నాళ్ల తర్వాత ట్విట్టర్ లోకి వచ్చిన నారా లోకేష్..!

Written By Siddhu Manchikanti | Updated: June 17, 2019 10:01 IST
చాన్నాళ్ల తర్వాత ట్విట్టర్ లోకి వచ్చిన నారా లోకేష్..!

చాన్నాళ్ల తర్వాత ట్విట్టర్ లోకి వచ్చిన నారా లోకేష్..!
 
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మొట్టమొదటిసారి 2019 ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో పోటీచేసి ఓడిపోవడం జరిగింది. దీంతో ఓడిపోయిన తర్వాత ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టి హడావిడి చేసిన లోకేష్ తాజాగా ట్విట్టర్ లోకి రిటర్న్ అయ్యారు. ఈ సందర్భంగా టిడిపి పార్టీకి చెందిన నాయకులు మళ్లీ అబద్దాలే ఆయుదాలుగా ప్రచారం చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది.
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిలోనే ఆయన కుమారుడు లోకేష్ కూడా పయనిస్తున్నారు. టిడిపి సానుభూతిపరులపై వైసిపి రౌడీలు దాడులు చేస్తున్నారని ఆయన ట్విటర్ లో ఆరోపించారు. గత కొద్ది రోజులుగా టిడిపి నేతలు పాడుతున్న పాటనే ఈయన కూడా పాడారు. దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్‌ సహనాన్ని పరీక్షించవద్దని ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని లోకేష్ పేర్కొన్నారు.
Top