స్విస్ అధికారులు బయట పెట్టబోతున్న భారతీయుల జాబితా ?

Written By Siddhu Manchikanti | Updated: June 17, 2019 10:06 IST
స్విస్ అధికారులు బయట పెట్టబోతున్న భారతీయుల జాబితా ?

స్విస్ అధికారులు బయట పెట్టబోతున్న భారతీయుల జాబితా ?
 
2014 ఎన్నికల సమయంలో అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని దేశం లోకి తీసుకు వచ్చి ప్రజలకు పంచుతామని తెలపడం జరిగింది. అయితే ఆ తరువాత మోడీ ఇచ్చిన హామీ పై పచ్చగా పట్టించుకున్న దాఖలాలు కనబడలేదు. అయితే తాజాగా రెండోసారి అధికారంలోకి రావడంతో మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో నరేంద్ర మోడీ సర్కార్ ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా భారతీయ కుబేరుల జాబితాను తీసుకొనేందుకు ఒప్పందం చేసుకుంది.
 
ఈ నేపథ్యంలో స్విస్ ప్రభుత్వం నల్లధనాన్ని పోగేసుకున్న సుమారు 50 మంది భారతీయుల వివరాలను భారతదేశానికి అందజేసే ప్రక్రియను ప్రారంభించింది. కొన్ని వారాల క్రితం 50 మంది భారతీయులకు స్విస్ ప్రభుత్వం నల్లధనం సంబంధించి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. వీరి వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకోవడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వారిని కోరినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈసారి భారీ మెజార్టీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయుల నల్ల కుబేరుల లిస్టును బయటకు తీయాలి అనే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.
Top