జగన్ కేసుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుజనా చౌదరి..!

Written By Siddhu Manchikanti | Updated: June 18, 2019 11:29 IST
జగన్ కేసుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుజనా చౌదరి..!

జగన్ కేసుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుజనా చౌదరి..!
 
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్... కేసులకు ముందు ఎప్పుడూ అదికారంలో లేరని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. అతనిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదని,తాను గతంలో కూడా చెప్పానని పేర్కొన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనా చౌదరి అనేక విషయాలు తెలియజేశారు. యువ నేత నారా లోకేష్ ఆద్వర్యంలో ఓటమి నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
లోకేష్ ఓటమి పై మాట్లాడుతూ వాటిపై స్టడీ చేస్తే మంగళగిరి సీటు ఎంపిక చేసుకోవడమే తప్పు అని అన్నారు. అది బిసి సీటు అని, ఆళ్ల రామకృష్ణారెడ్డి గతసారి గెలిచారని, ఆయన బాగా పనిచేశారని సుజనా అన్నారు. నెగిటివ్ ఓటింగ్ వల్ల ఓడిపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్.డి.ఎ. లో కొనసాగి ఉంటే టిడిపి మళ్లీ గెలిచి ఉండేవారమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రజలలో సరిగా వివరించలేకపోయామని అన్నారు. ఎపిలో బిజెపిని పినిష్ చేశామని, దాని వల్ల మనం కూడా ఫినిష్ అయ్యామని ఆయన అన్నారు. ఈవిఎమ్ లను అనుమానించడం సరికాదని అన్నారు. వీటిపై చంద్రబాబును కొందరు మిస్ లీడ్ చేశారని అన్నారు.
Top