కేటీఆర్ ఎక్కడా అని కెసిఆర్ ని అడిగిన జగన్..!

కేటీఆర్ ఎక్కడా అని కెసిఆర్ ని అడిగిన జగన్..!

కేటీఆర్ ఎక్కడా అని కెసిఆర్ ని అడిగిన జగన్..!
 
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ అయ్యారు. కెసిఆర్ విజయవాడ వచ్చి దుర్గమ్మ దర్శనం తర్వాత జగన్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్ ఆయనకు ఎదురేగి కెసిఆర్ బృందానికి స్వాగతం చెప్పారు. ఇద్దరు పుష్పగుచ్చాలు అందచేసుకున్నారు.కాగా కెసిఆర్ జగన్ కు శాలువా కప్పారు. ఆ తర్వాత జగన్ వారిని లోనికి తీసుకువెళ్లారు.
 
ఈ క్రమంలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కనిపించకపోవడం తో కేసీఆర్ బృందంతో జగన్ కెటిఆర్ ఎక్కడ అని అడిగారు. అయితే కెటిఆర్ తండ్రి పక్కన కాకుండా వెనుక ఉండడంతో ముందు కనిపించలేదు. కాని జగన్ శ్రద్ద తీసుకుని ఆయనను కూడా పిలచుకుని ముందుకు తీసుకు వెళ్లడం ద్వారా గౌరవించారు. ఆ సమయంలో కెసిఆర్ తనతో పాటు వచ్చిన ఇతర నేతలను జగన్ కు పరిచయం చేశారు.ఆ తర్వాత అంతా కలిసి విందు తీసుకున్నారు. రెండు రాష్టాల విజభన సమస్యపై వీరు మాట్లాడుకోవచ్చని భావిస్తున్నారు.Top