పులివెందుల నుంచి వచ్చిన అబ్బాయి ఇలా చేస్తారు అని ఊహించలేదు: జెసి..!

పులివెందుల నుంచి వచ్చిన అబ్బాయి ఇలా చేస్తారు అని ఊహించలేదు: జెసి..!

పులివెందుల నుంచి వచ్చిన అబ్బాయి ఇలా చేస్తారు అని ఊహించలేదు: జెసి..!
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..తాజాగా ముఖ్యమంత్రి స్థానంలో జగన్ కూర్చున్నాక స్వరం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం లో ఢిల్లీ వెళ్లి ప్రసంగించిన జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు జేసీ. ముఖ్యమంత్రి జగన్ డిల్లీలో హుందాగా వ్యవహరించారని అది తనకు బాగా నచ్చిందని మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డి అన్నారు. అయితే తాను భయపడో, మరో కారణంతోనో అభినందించడం లేదని అన్నారు.
 
కానిప్రత్యేక హోదా పై ప్రదాని మోడీ గురించి మాట్లాడారని, అయినా దానిని వదలిపెట్టనని జగన్ చెప్పడం సమంజసంగా ఉందని ఆయన అన్నారు. పులివెందుల నుంచి వచ్చిన అబ్బాయి ఇలా ఉంటారని అని ఊహించలేదని ఆయన అన్నారు. తాము బిజెపి నుంచి ఆహ్వానం వచ్చిన మాట నిజమేనని ఆయన చెప్పారు. అయితే తాను బిజెపిలో చేరతానని,కానిచేరనని కాని చెప్పలేదు.అయితే తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని గుర్తు చేశారు. అయితే అందరిని పలకరించడానికి వచ్చానని దివాకరరెడ్డి అన్నారు.Top