దేనికైనా సిద్ధం అంటున్న మాజీ స్పీకర్ కోడెల..!

Written By Siddhu Manchikanti | Updated: June 18, 2019 11:42 IST
దేనికైనా సిద్ధం అంటున్న మాజీ స్పీకర్ కోడెల..!

దేనికైనా సిద్ధం అంటున్న మాజీ స్పీకర్ కోడెల..!
 
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ టిడిపి నాయకుడు కోడెల శివప్రసాద్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. కోడెల కుటుంబం మొత్తం నియోజకవర్గంలో బ్రతుకుతున్న సామాన్యుల దగ్గర నుండి కే టాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఇప్పటికే చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం జరిగింది. బాధితుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు కోడెల కొడుకుపై మరియు కుమార్తె పై పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
ఈ నేపథ్యంలో కేసుల విషయమై తాజాగా కోడెల శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ తన కుటుంబం పై అక్రమ కేసులు పెడుతున్నారని.. దొంగ కేసులు పెడుతున్నారని వీటిని అన్నిటినీ వెనకనుండి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రోత్సహిస్తున్నారని కోడెల ఆరోపించారు. అయితే మేము తప్పు చేయలేదు, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోము అని అవసరమైతే సిట్‌ విచారణకు కూడా తాము సిద్దంగా ఉన్నమని చెపుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, అధికారంలో ఉండి ఇల్లంటి తప్పులు చేయడం మంచిది కాదని పేర్కొన్నారు.
Top