అసెంబ్లీలో ప్రజలకు వరాలు కురిపించారు ఏపీ సీఎం జగన్..!

అసెంబ్లీలో ప్రజలకు వరాలు కురిపించారు ఏపీ సీఎం జగన్..!

అసెంబ్లీలో ప్రజలకు వరాలు కురిపించారు ఏపీ సీఎం జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన చివరి రోజు అసెంబ్లీ సమావేశాలలో ఎపిలో మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ కే రుణాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో జగన్ మాట్లాడారు. ఎన్నికల కు ముందు ఒక విదానం, తర్వాత మరో విదానం తమది కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు , మహిళలకు సున్నా వడ్డీ పదకాలను రద్దు చేశారని, తాము మాత్రం వైఎస్ ఆర్ సున్నా వడ్డీ పేరుతో పునరుద్దరిస్తామని ఆయన అన్నారు.
 
గత ఐదేళ్లలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు రెండువేల కోట్ల పెండింగులో ఉన్నాయని, అదికారంలోకి వచ్చిన వెంటనే ఆ సబ్సిడీని విడుదల చేస్తూ సంతకం చేశామని అన్నారు. అలాగే రైతుల భీమాను కూడా ప్రభుత్వమే కట్టి, పరిహారం గురించి కూడా ప్రభుత్వమే వెంటబడుతుందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిదిని రెండువేల కోట్లు బడ్జెట్ ఓ పెడతామని ఆయన అన్నారు. రైతుల ధరల స్థిరీకరణ నిది కింద మూడువేల కోట్లు పెడతామని జగన్ తెలిపారు.Top