ఎప్పుడూ ఇలానే రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలి అంటున్న కేసీఆర్..!

Written By Siddhu Manchikanti | Updated: June 19, 2019 11:15 IST
ఎప్పుడూ ఇలానే రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలి అంటున్న కేసీఆర్..!

ఎప్పుడూ ఇలానే రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలి అంటున్న కేసీఆర్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు మంచిగా ఉండేటట్లు ముందు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో సఖ్యత గా ఉంటూ దక్షిణాది రాష్ట్రాలలో కీలకంగా మారటానికి ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, ఉల్లాసభరితమైన సంబంధాన్ని కొనసాగించాలని తెలంగాణ మంత్రి వర్గం స్పష్టమైన అవగాహనతో కూడిన నిర్ణయానికి వచ్చిందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.
 
ఇటీవలి పరిణామాలతో తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడిందని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ రాకముందు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో రోజూ బస్తీమే సవాల్‌ అనే పరిస్థితులు ఉండేవి. అనేక వివాదాలు ఉండేవి. కోర్టు వ్యాజ్యాలుఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కర్ణాటకతో మంచి సత్సంబంధాల్ని కొనసాగిస్తున్నాం. ఇలా.. మూడుసార్లు నీటిని పరస్పరం పంపిణీ చేసుకున్నాం. అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 45లక్షల ఎకరాలకు రెండు విడతల్లో నీరిస్తుంది. పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటిని అందించే పథకమిది. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు.
Top