అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన జగన్..!

అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన జగన్..!

అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయమై మరోసారి తీర్మానం చేసింది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి శాంతి ప్రత్యేక హోదాపై ఏపీ శాసనసభ మరొకసారి తీర్మానం ప్రవేశపెట్టింది. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు ప్రభుత్వమని సభలో పేర్కొన్నారు జగన్. ప్యాకేజీ వద్దు..ప్రత్యేక హోదానే కావాలని అసెంబ్లీ ద్వారా కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన ప్రకటించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అప్పటి ప్రభుత్వం సరిదిద్దక పోగా .. ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమైంది.
 
అందుకే ఈరోజు మనమంతా పోరాటం చేయాల్సి వస్తోంది. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 59 శాతం జనాభాను, 47శాతం అప్పులను వారసత్వంగా పొందాం. అని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదని జగన్ తెలిపారు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున హోదా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నాని జగన్ ప్రకటించారు.Top