ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న విజయసాయి రెడ్డి - సిఎం రమేష్ భేటీ…!

Written By Siddhu Manchikanti | Updated: June 19, 2019 11:27 IST
ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న విజయసాయి రెడ్డి - సిఎం రమేష్ భేటీ…!

ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న విజయసాయి రెడ్డి - సిఎం రమేష్ భేటీ…!
 
ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగిపోయే విధంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓటమిని ఇవ్వటంతో..ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో చాలా దయనీయంగా మారింది. ఇటువంటి క్రమంలో మొన్నటి దాకా తీవ్రమైన విమర్శలు చేసుకున్న వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టిడిపి ఎమ్.పి సి.ఎమ్.రమేష్ లు పక్కపక్కన కూర్చుని మంతనాలు జరిపిన విషయం మీడియాలో వార్తలుగా వచ్చింది. అందరి దృష్టిని ఇది ఆకర్షించింది.
 
విజయసాయిరెడ్డిని రమేష్ ఎంత దారుణంగా దూషించింది అందరికి తెలిసిందే. అయితే లోక్ సభ సభ్యుల ప్రమాణాల సందర్భంగా విజయసాయిరెడ్డి పక్కకు రమేష్ వచ్చి కూర్చున్నారట. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ మాట్లాడుతూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చినా ఆయన వారిద్దరికీ కొంత దూరంలో కూర్చున్నారు. అయినా కూడా సీఎం రమేశ్‌, విజయసాయిరెడ్డిలు చర్చల్లో బిజీ అయిపోయారట. దీనిపై విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తే, ‘‘మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేశ్‌ను అడిగాను’’ అని జవాబిచ్చారట. మొత్తం మీద ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తుంది విజయసాయి రెడ్డి - సిఎం రమేష్ భేటీ.
Top