తన అత్యంత సన్నిహితుడికి కీలక పదవిని కట్టబెట్టిన ఏపీ సీఎం జగన్..!

తన అత్యంత సన్నిహితుడికి కీలక పదవిని కట్టబెట్టిన ఏపీ సీఎం జగన్..!

తన అత్యంత సన్నిహితుడికి కీలక పదవిని కట్టబెట్టిన ఏపీ సీఎం జగన్..!
 
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రథమ రాజకీయ సలహాదారుడిగా కేవీపీ రామచంద్రరావు అప్పట్లో ఉండేవారు. అంతేకాకుండా వైయస్ ఆత్మగా కేవీపీ ని అప్పట్లో అభివర్ణించేవారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కి కూడా తన తండ్రికి కేవీపీ ఎలాగో అలాంటి ఒక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలా మంది ఆంధ్ర రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయిన ఏపీ సీఎం జగన్ తన అత్యంత సన్నిహితుడిగా రాజకీయ సలహాదారుడు గా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి ని ఏపీ సీఎం ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించారు.
 
ఈ మేరకు ఏడీ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జలకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. సజ్జల నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని, ఈ నియామకానికి సంబంధించి నియమ నిబంధనలను విడిగా విడుదల చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు రాజకీయ సలహాదారుగా గతంలో సజ్జల వ్యవహరించారు. ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల కొనసాగుతున్నారు. కాగా, సుదీర్ఘకాలంగా జర్నలిస్ట్ గా ఆయన పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మీడియా వ్యవహారాల బాధ్యతలను సజ్జల నిర్వహించారు.Top