ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ కు కీలక ప్రకటన చేసిన సీఎం జగన్..!

Written By Siddhu Manchikanti | Updated: June 21, 2019 10:21 IST
ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ కు కీలక ప్రకటన చేసిన సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ కు కీలక ప్రకటన చేసిన సీఎం జగన్..!
 
ఏపీ సీఎం జగన్ పాలనలో పాలనలో తన మార్క్ నిర్ణయాలు ఉండేలా చూసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి మరోపక్క సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు కాకముందే జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఒకపక్క జాతీయ రాజకీయాల్లో మరోపక్క రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇటువంటి క్రమంలో విధానపరమైన నిర్ణయాలేవీ తనకు చెప్పకుండా ముందస్తుగా ప్రకటించవద్దని ఎపి ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంత్రులకు నోట్ పంపినట్లు సమాచారం వచ్చింది.
 
ప్రభుత్వపరంగా ఎదురయ్యే లాభనష్టాలను అంచనా వేయకుండా.. వాటిపై అధ్యయనం చేయకుండా ప్రకటనలు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ప్రభుత్వానికి దశ-దిశ నవరత్నాలేనని, వీటికే మంత్రులు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా వాటి అమలుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున 4 లక్షల మందిని నియమించడం.. ఒక్కో గ్రామ సచివాలయంలో పది మంది చొప్పున 1.60 లక్షల మందిని నియమించడం ద్వారా పాలనను ప్రజల వద్దకు చేర్చనున్నామని ఆయన అన్నారు.
Top