జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కేశినేని నాని..!

Written By Siddhu Manchikanti | Updated: June 22, 2019 10:13 IST
జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కేశినేని నాని..!

జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కేశినేని నాని..!
 
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై షాకింగ్ కామెంట్ చేశారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి, టీజి వెంక‌టేష్‌, గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు బిజెపి పార్టీ లో చేరిన క్రమంలో కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని జగన్ పై వ్యాఖ్యలు చేస్తూ ఇప్పుడు పరిస్థితి తలకిందులుగా జగన్ తపస్సు చేసిన ప్ర‌త్యేక హోదాను సాధించ‌లేర‌ని ఎద్దేవా చేశారు.
 
తాను బీజేపీలో చేర‌బోతున్నాన‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని, ఆ అవ‌స‌రం కూడా నాకు లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను ప్ర‌ధాని మోదీని వ్య‌క్తిగ‌త కార‌ణాల వల్ల క‌ల‌వ‌లేద‌ని, ఆయ‌న ప్ర‌ధాని కాబ‌ట్టి క‌లిశాన‌ని, రేపు జ‌గ‌న్‌ని కూడా క‌లుస్తాన‌ని, ఆయ‌న ముఖ్య‌మంత్రి కాబ‌ట్టి ప్ర‌జ‌ల కోసం క‌లుస్తాన‌ని, అంత మాత్రాన తాను పార్టీ మారుతున్న‌ట్టా? అని ఎదురు ప్ర‌శ్నించారు. రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల ప్ర‌యోజనాల కోసం తాను ఎక్క‌డికైనా వెళ‌తాన‌ని, ఎవ్వ‌రినైనా క‌లుస్తాన‌ని కేశినేని నాని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
Top