విజయసాయిరెడ్డిని కీలక పదవిలో కూర్చోపెట్టిన ఏపీ సీఎం జగన్..!

విజయసాయిరెడ్డిని కీలక పదవిలో కూర్చోపెట్టిన ఏపీ సీఎం జగన్..!

విజయసాయిరెడ్డిని కీలక పదవిలో కూర్చోపెట్టిన ఏపీ సీఎం జగన్..!
 
రాజకీయాలలో తనతో పాటు కష్టాలు పడిన ప్రతి ఒక్కరిని పైకి తెచ్చుకునే కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తండ్రి చనిపోయిన నాటినుండి ప్రజలు తనను ఎంతగానో నమ్మిన నేపథ్యంలో ఒకపక్క పాలనలో అవినీతి లేకుండా ప్రతి పేదవాడు బతికేలా సంక్షేమ పథకాలు ప్రకటించిన జగన్ తనతో పాటు గత కొంతకాలంగా కష్టాలు పడిన ప్రతి ఒక్క నేతకు తగిన సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రి కాలం నాటి నుండి తన ఆర్థిక వ్యవహారాలలో రాజకీయాలలో ముందునుండి తోడుగా ఉన్న వెన్నంటే ఉన్న విజయసాయి రెడ్డి కి కీలక పదవిని కట్టబెట్టారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించారు జగన్. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి అంటే మామూలు పదవి అనుకునేరు. ఇంచుమించు కేబినేట్ మంత్రి హోదా అది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. ఆ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ఘోర పరాజయం పాలు కాగానే.. అప్పటి వరకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావు.. తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా జగన్.. విజయసాయిరెడ్డికి ఆ పదవిని ఇచ్చారు.Top