పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి తీవ్ర ఓటమి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో స్పందించారు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు స్థానం నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన నాగబాబు చాలా దారుణంగా ఓటమి పాలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల అయిపోయిన తర్వాత ఇటీవల యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ పై నమ్మకం చూపించలేకపోయారు అని పేర్కొన్నారు. "చంద్రబాబుపైనా, ప్రభుత్వంపైనా విపరీతమైన కోపంతో ఉన్న ప్రజలు పవన్ కల్యాణ్ కు ఓటేస్తే అది వృథా అవుతుందేమో అన్న సందేహానికి లోనయ్యారు. ఇలాంటి సమయంలో చంద్రబాబును గద్దె దింపాలంటే వారికి జగన్ ఒక్కడే కనిపించాడు. నేను చాలామంది ప్రజలతో మాట్లాడాను. వారందరిదీ ఒకటేమాట. ఈసారికి జగన్ కు ఓటేస్తాం, 2024లో మాత్రం పవన్ కల్యాణ్ నే గెలిపించుకుంటాం అని చెప్పారు. జనసేన ఓడిపోయిందంటే అందులో ఓటర్ల తప్పేంలేదు. వారు చెప్పినట్టే చేశారు. జగన్ విషయానికొస్తే సానుభూతి అంశం బాగా పనిచేసింది. జగన్ కు ఒక్క చాన్సిద్దాం, 2024లో పవన్ ను గెలిపిద్దాం అని ప్రజలు భావించారు" అంటూ నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు.