ఇదంతా చంద్రబాబు డ్రామా..!

Written By Siddhu Manchikanti | Updated: June 23, 2019 12:24 IST
ఇదంతా చంద్రబాబు డ్రామా..!

ఇదంతా చంద్రబాబు డ్రామా..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓటమి పాలవడంతో ఆ పార్టీ నుండి బిజెపిలో చేరిన నలుగురు ఎమ్.పిలలో ముగ్గురు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు బినామీలేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తనపై అవినీతి కేసులు రాకుండా రక్షణ కోసమే వారిని బిజెపిలోకి చంద్రబాబు పంపించారని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు. చంద్రబాబుకు తెలయకుండానే ఫిరాయిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసేవారని, ఇది 100 శాతం మ్యాచ్‌ ఫిక్సింగేనని విజయసాయి రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసిందన్నారు, రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్‌ను అర్థం చేసుకుందని, ఇక నుంచి బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయని ఆయన అన్నారు. ఇదంతా చంద్రబాబు డ్రామా అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.
Top