ఆంధ్రాలో టిడిపి పని అయిపోయింది అంటున్నా బిజెపి..!

Written By Siddhu Manchikanti | Updated: June 24, 2019 17:06 IST
ఆంధ్రాలో టిడిపి పని అయిపోయింది అంటున్నా బిజెపి..!

ఆంధ్రాలో టిడిపి పని అయిపోయింది అంటున్నా బిజెపి..!
 
రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్లే అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు ప్రస్తుత పరిస్థితి బట్టి వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ లో మొదటి సారి జరిగిన ఎన్నికలలో బాగానే సీట్లు సాధించిన తరువాత జరిగిన ఎన్నికలలో కెసిఆర్ దెబ్బకి తుడిచిపెట్టుకుపోయింది. ఇదే క్రమంలో విభజన జరిగిన తర్వాత మిగిలి ఉన్న ఆంధ్రా లో మొట్టమొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికారం సాధించగా ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో చాలా దారుణంగా జగన్ దెబ్బకి చరిత్రాత్మకమైన ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నాయకులు భవిష్యత్తులో రాజకీయాల్లో రాణించాలంటే పార్టీని వీడటం మంచిదని తెగ అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని బిజెపి ప్రదాన కార్యదర్శి పి.మురళీధరరావు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబు.. మోదీని ఓడించడానికి దేశమంతటా తిరిగారు.. కానీ తన అభ్యర్థులనే గెలిపించుకోలేకపోయారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోతుందని జోస్యం చెప్పారు.బెంగుళూరులో ఆయన మాట్లాడారు.కర్నాటకలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపికి 200 సీట్లు ఖాయంగా వస్తాయని ఆయన చెప్పారు. కర్నాటక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలను తిరస్కరిస్తే వీరు అక్రమంగా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని బిజెపి ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు అన్నారు.
Top