మాట నిలబెట్టుకున్న సీఎం జగన్…!

మాట నిలబెట్టుకున్న సీఎం జగన్…!

మాట నిలబెట్టుకున్న సీఎం జగన్…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దానిలో కరాఖండిగా వ్యవహరిస్తున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రం అప్పుల కోరల్లో ఉన్న నేపథ్యంలో దుబారా ఖర్చులు తగ్గిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో జగన్ వాటిని అమలు చేయటానికి ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ గతంలో ఏపీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. గతంలో రైతులకు ఏవైతే జగన్ మాట ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి ఏపీ వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు దృష్టిసారించారు. ఈ సందర్భంగా ఆయన రైతు భరోసా స్కీమ్ అమలు ఫైల్ పై తొలి సంతకం చేయడం విశేషం. రైతులకు పెట్టుబడి సాయం అందించి అండగా నిలవాలని మేనిఫెస్టోలో చెప్పిన మాట నిజం చేస్తామన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సహకార సొసైటీల అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కౌలు రైతులకు కూడా బీమా, రుణాలు, ఇతర రాయితీలు కల్పిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి.. తక్షణమే అరికట్టి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కన్నబాబు తెలిపారు.Top