దేవినేని పై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి..!

Written By Siddhu Manchikanti | Updated: June 24, 2019 17:11 IST
దేవినేని పై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి..!

దేవినేని పై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి..!
 
గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసి దేవినేని ఉమపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ఇటీవల దేవినేని మాటలు గురించి విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ దొంగే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరినట్టుందని తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమ అనడం దమ్ముంటే తనను పట్టుకొమని దొంగ పోలీసులకు సవాల్ విసరినట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. అన్ని అనుమతులు ఉండి పనులు మొదలైన ప్రాజెక్టును టీడీపీ సర్కార్ ఏటీఎంలాగా వాడుకొన్నారని విజయ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు. మీ దోపీడీలన్నీ బయటకొస్తాయని... ఎవరూ కూడ తప్పించుకోలేరని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టాం. దేశంలోని ఓబీసిలంతా సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని జగన్‌ ఆకాంక్షగా ఆయన ట్వీట్ చేశారు. దీనిపై చర్చ తప్పనిసరిగా అభ్యున్నత్తికి దారులు వేస్తోందని ఆయన చెప్పారు.ప్రజా వేదికను ప్రభుత్వ నిధులతో నిర్మించింది... దీన్ని చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓడిపోయినా కూడ చంద్రబాబు తన ఆక్రమణలోనే పెట్టుకొన్నారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు ప్రజా వేదికను సిద్దం చేస్తోంటే చంద్రబాబు లేనప్పుడు తాళాలు తీస్తారా అంటూ ఆ పార్టీ నేతలు సానుభూతి డ్రామాలు ఆడడం పరువు తీసుకోవడమేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Top