కార్యకర్తలను కాపాడండి అంటున్న చంద్రబాబు..!

కార్యకర్తలను కాపాడండి అంటున్న చంద్రబాబు..!

కార్యకర్తలను కాపాడండి అంటున్న చంద్రబాబు..!
 
యూరప్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడ నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైసీపీ నేతలు టీడీపీకి చెందిన కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు ఇటీవల జరిగిన కొన్ని దాడులలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించాలని సీనియర్ నేతలకు చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా సీఆర్‌డీఏ, పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు.టీడీపీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉందని భరోసా కల్పించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. విదేశీ పర్యటన నుండి వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయనున్నట్టు బాబు పార్టీ నేతలకు వివరించారు.Top