జగన్ ముఖ్యమంత్రి అవడం తో ప్రశాంతి కిషోర్ కి దేశంలో గిరాకీ పెరిగిపోయింది…!

Written By Siddhu Manchikanti | Updated: June 24, 2019 17:13 IST
జగన్ ముఖ్యమంత్రి అవడం తో ప్రశాంతి కిషోర్ కి దేశంలో గిరాకీ పెరిగిపోయింది…!

జగన్ ముఖ్యమంత్రి అవడం తో ప్రశాంతి కిషోర్ కి దేశంలో గిరాకీ పెరిగిపోయింది…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చరిత్రాత్మకమైన విజయం సాధించడం లో జగన్ ముఖ్యమంత్రి అవడం లో ప్రధాన పాత్ర పోషించారు జగన్ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడంలో ప్రశాంతి కిషోర్ ఇచ్చిన రాజకీయ సలహాలు జగన్ పాటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో జగన్ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పై చాలామంది దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతల కళ్ళు పడ్డాయి. ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేయడానికి దేశంలో ఉన్న చాలామంది నేతలు క్యూ కడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ కోసం పనిచేయాలంటూ వీరిద్దరు కొద్ది రోజుల కిందట భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు పీకే టీంతో ఆమె ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలని అక్కడి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే పీకేతో ఈ మేరకు ఒప్పందం చేసుకోవాలని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రయత్నిస్తున్న సమయంలో ఎమ్ఎన్ఎమ్ పార్టీ అధినేత, సినీనటుడు కమల్ హాసన్‌ను ప్రశాంత్ కిశోర్ రెండు రోజుల క్రితం చెన్నైలోని ఎమ్ఎన్ఎమ్ పార్టీ కార్యాలయంలో కలిసారు. అయితే వీరిద్దరి మధ్య దాదపు రెండు గంటల పాటు చర్చలు నడిచాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో కమల్ హాసన్ ఎమ్ఎన్ఎమ్ పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం ఖాయమనే ప్రచారం తమిళ రాజకీయాలలో జోరుగా సాగుతుంది.
Top