కాల్ మనీ, సెక్స్ కేసులను బయటకు తీసిన జగన్..!

Written By Siddhu Manchikanti | Updated: June 26, 2019 12:51 IST
కాల్ మనీ, సెక్స్ కేసులను బయటకు తీసిన జగన్..!

కాల్ మనీ, సెక్స్ కేసులను బయటకు తీసిన జగన్..!

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమ కార్యక్రమాలన్నింటిని వెలికి తీసే పని చేపట్టారు ఏపీ నూతన సీఎం జగన్. చట్టం రాజ్యాంగం అందరికీ ఒకేలా ఉండాలని అధికారులకు ఒకలాగా సామాన్యులకు మరొక లాగా ఉండకూడదని ఇటీవల శాంతిభద్రతలపై జరిపిన సమీక్ష సమావేశంలో జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాల్ మనీ, సెక్స్ కేసుల వ్యవహారంపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
 
శాంతి భద్రతలపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కాల్ మనీ సెక్స్ కుంభకోణంలో ఏ పార్టీ వారు ఉన్నా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని ఆయన అన్నారు. అలాగే గంజాయి సాగును నియంత్రించే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ కోరారు.
Top