పోలీసులకు కొత్త సూచనలు ఇచ్చిన సీఎం జగన్..!

Written By Siddhu Manchikanti | Updated: June 26, 2019 12:54 IST
పోలీసులకు కొత్త సూచనలు ఇచ్చిన సీఎం జగన్..!

పోలీసులకు కొత్త సూచనలు ఇచ్చిన సీఎం జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయిన జగన్ పాలనలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు ప్రభుత్వాలు అండగా ఉండేటట్లు ప్రభుత్వ అధికారులు సేవకులుగా మెలిగేటట్టు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ప్రజావేదిక భవనంలో కలెక్టర్లతో సమావేశమైన జగన్ తాజాగా రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎపిలో పోలీసింగ్ వ్యవస్థ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. నెంబర్ వన్ పోలిసింగ్ అంటే ఇసుక మాఫియాలను చూస్తూ ఊరుకోవడమా?అక్రమ మైనింగ్ జరుగుతుంటే పట్టించుకోకుండా ఉండడమా? ఒక మహిళా ఎమ్.ఆర్.ఓ.ని స్వయంగా ఒక ఎమ్మెల్యేనే వేదిస్తే కేసు పెట్టకుండా ఉండడమా అని జగన్ పేర్కొన్నారు.
 
ఎస్పిల సమావేవశంలో జగన్ మాట్లాడుతూ రెండు లక్షల మంది ఎన్నుకునే ఎమ్మెల్యేలను గౌరవించాలని సూచించారు. అయితే అదే సమయంలో అక్రమాలను అనుమతించనవసరం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఒక సమస్య తీసుకొచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలి. సమస్య ఉందని ఎవరైనా మన వద్దకు వచ్చినప్పుడు వారి బాధను ఓపిగ్గా వినాలి. సానుకూలంగా వింటే 50శాతం సమస్య పరిష్కారమైనట్లే అని ఆయన అన్నారు. ఎప్సి లు కూడా చిరునవ్వుతో పలకరించాలని సలహా ఇచ్చారు. స్నేహపూర్వక పోలీసింగ్ ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ లలో రిసెప్షన్ విభాగాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు దళితులు లాంటి వారికి అండగా పోలీసులే ఉండాలని..సమాజంలో వారి వాయిస్ చాలా తక్కువగా ఉంటుందని పోలీస్ వ్యవస్థ వారికి బలంగా నిలబడాలని జగన్ పేర్కొన్నారు.
Top