తన తండ్రి పుట్టిన రోజును రైతుల దినోత్సవం గా మార్చిన జగన్..!

తన తండ్రి పుట్టిన రోజును రైతుల దినోత్సవం గా మార్చిన జగన్..!

తన తండ్రి పుట్టిన రోజును రైతుల దినోత్సవం గా మార్చిన జగన్..!
 
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల అన్న వ్యవసాయం అన్నా చాలా ఇష్టం అని అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి దేశంలో ఎవరూ చేయని విధంగా పాదయాత్ర చేసి వారి కష్టాలను తెలుసుకుని ఉచిత విద్యుత్ ప్రకటించి ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో గెలవడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ తన తండ్రి పుట్టినరోజు నాడు అయిన జూలై ఎనిమిదో తేదిని రైతు దినోత్సవం రోజు గా ప్రకటించారు.
 
ఆ రోజున రైతులకు సంబందించిన పలు కార్యక్రమాలు చేపడతారు. పెంచిన సామాజిక పింఛన్లను ఆ రోజు నుంచి పంపిణీ చేస్తామని, రైతులకు వడ్డీలేని పంట రుణాలు, వైఎస్సార్‌ బీమా వంటి పథకాలను ఆ రోజున ప్రారంభిస్తామని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ లను హడావుడిగా రెండువేలు చేసిందని, కాని మనం వెయ్యి నుంచి 2250 రూపాయలు చేసినట్లు అని ఆయన అబిప్రాయపడ్డారు. ప్రజలకు ఈ విషయం తెలియచేయాలని జగన్ అధికారులకు సూచించారు.Top