చిరంజీవి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బిజెపి..?

Written By Siddhu Manchikanti | Updated: June 26, 2019 14:03 IST
చిరంజీవి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బిజెపి..?

చిరంజీవి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బిజెపి..?
 
గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర మంత్రి గా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండటం జరిగింది. తర్వాత సినిమాలు చేసుకుని తిరిగి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా బిజెపి వైపు చూస్తున్న ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకురావడానికి బిజెపి పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
 
చిరు తమ పార్టీలో చేరితే.. ఆయన్ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు బీజేపీ నేతలు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని కాషాయ పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికే సిద్ధపడని చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో చేరతారనేది అనుమానమే. అదీగాకుండా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న తరుణంలో చిరంజీవి భాజాపా ఆఫ‌ర్‌కు సై అంటారా లేకా నై అంటారో వేచి చూడాల్సిందే.
Top