హామీలు ఇవ్వకుండానే మేలు చేసిన జగన్…!

హామీలు ఇవ్వకుండానే మేలు చేసిన జగన్…!

హామీలు ఇవ్వకుండానే మేలు చేసిన జగన్…!
 
ఆంధ్రరాష్ట్రాని కి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు నూతన సీఎం జగన్. విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అప్పులపాలు చేసిన రాష్ట్రంలో తనను నమ్మిన ప్రతి ఒక్కరికి రాజకీయాలు, మతాలు, కులాలు చూడకుండా జగన్ ప్రకటిస్తున్న హామీల పట్ల ఆంధ్ర ప్రజలు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే అది సంచలనమైనదే. అమ్మ ఒడి స్కీమ్ ను ఇంటర్ విద్యార్దులకు కూడా వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
 
బడికి పంపే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన నేపద్యంలో ఇంటర్‌ విద్యార్థులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ అమ్మఒడి వర్తింపజేయాలని ఆదేశించారు. తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించారు.మొదటగా కేవలం పదో తరగతిలోపు విద్యార్థులకే ఈ పథకంఅమలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఇంటర్ విద్యార్దులకు కూడా పేదరికం ప్రాతిపదికగా అమలు చేయాలని నిర్ణయించడం సంచలనమైన విషయమే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా ఇవ్వడంతో చాలామంది రాష్ట్రంలో ఉన్న ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంమీద చూసుకుంటే ఒకపక్క ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోపక్క హామీలు ఇవ్వకుండానే ప్రజల జీవితాలలో వెలుగుల నింపుతున్నారు జగన్ అంటూ కామెంట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.Top