చంద్రబాబు ని పరుగులు పెట్టిస్తున్నసీఎం జగన్ నిర్ణయాలు..!
రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉంది అంటూ తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ని ఏపీ సీఎం జగన్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. విషయంలోకి వెళితే గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది పక్కన ప్రజావేదిక అనే భవనం కట్టడం జరిగింది. ఆ సమయంలోనే ప్రతిపక్షంలో ఉన్న జగన్ చంద్రబాబు చేస్తున్నది తప్పు అంటూ ఖండించడం జరిగింది...అయినా కానీ అధికారంలో ఉన్న చంద్రబాబు జగన్ చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం బేఖాతరు చేయకుండా తాను అనుకున్నట్లు ప్రజా వేదిక భవనాన్ని కటించడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్...చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రూల్స్ ను అతిక్రమించి కట్టిన ప్రజావేదిక భవనాన్ని కూల్చడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
ఇదిలావుండగా తాజాగా గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఉండవల్లిలోని కరకట్టపై ప్రత్యేకంగా తన కోసం సకల సౌకర్యాలతో ఓ నూతన భవనాన్ని లంగమనేని రమేష్‌కు చెందిన స్థలంలో నిర్మించుకున్నారు. అక్కడి నుంచి ఏపీ పాలన కొనసాగిస్తూ వచ్చారు. అయితే దానికి సమీపంలోని వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడం అని తేలడంతో దాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. దానికి సమీపంలో వున్న చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడం అని తేలడం, దాన్ని కూడా కూలుస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పడంతో బాబు కొత్త ఇంటి కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు సమాచారం.