మీ తండ్రే ఏం చేయలేకపోయారు నువ్వేం చేస్తావు..? జగన్ పై రెచ్చిపోయిన లోకేష్…!

Written By Siddhu Manchikanti | Updated: June 28, 2019 10:06 IST
మీ తండ్రే ఏం చేయలేకపోయారు నువ్వేం చేస్తావు..? జగన్ పై రెచ్చిపోయిన లోకేష్…!

మీ తండ్రే ఏం చేయలేకపోయారు నువ్వేం చేస్తావు..? జగన్ పై రెచ్చిపోయిన లోకేష్…!
 
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సుఖభోగాల కు పోయి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడంతో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన జగన్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెట్టడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను బయట పెట్టడానికి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో జగన్ ప్రకటనపై టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్... జగన్ పై రెచ్చి పోయారు.
 
జగన్ కి కౌంటర్ లు వేస్తూ అదిరిపోయే డైలాగు వేశారు నారా లోకేష్. పోల‌వ‌రంపై టీడీపీ హ‌యాంలో పంపిన అంచ‌నాల‌న్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల ఇక కల గానే మిగిలిపోతుందని జగన్ పై విరుచుకు పడ్డారు లోకేష్. మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది. అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌! అంటూ జగన్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించారు.
Top