చిరంజీవి గురించి వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్న మెగా అభిమానులు..!

Written By Siddhu Manchikanti | Updated: June 28, 2019 10:13 IST
చిరంజీవి గురించి వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్న మెగా అభిమానులు..!

చిరంజీవి గురించి వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్న మెగా అభిమానులు..!
 
2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి గా పోటీ చేసిన చిరంజీవి దారుణంగా ఓటమి చెందడంతో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడంతో చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో అనవసరంగా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని చాలా మంది చిరంజీవి వీరాభిమానులే కామెంటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడం తిరిగి చిరంజీవి సినిమాల్లోకి రావడం తో సంతోషపడ్డా మెగా అభిమానులకు ఇప్పుడు తాజాగా చిరంజీవి పై వస్తున్న రాజకీయ వార్తలపై కంగారుపడుతున్నారు.
 
అదేమిటంటే ఇటీవల చిరంజీవి బిజెపి పార్టీలోకి వెళ్తున్నట్లు గత కొన్ని రోజుల నుండి వరుసగా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వార్తలు రావడంతో మెగా అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి మల్లి రాజకీయాల్లోకి వస్తే మాత్రం, తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్తాపించినటువంటి జనసేన పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చాలా ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే పవన్కళ్యాణ్ పార్టీ లోకి వస్తే చాలా బాగుంటుందని కొంతమంది అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం అభిమానులు మాత్రం చిరంజీవి సినిమాల్లోనే ఉండాలని తిరిగి రాజకీయాల్లోకి రాకూడదని కోరుకుంటున్నారు.
Top