చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు, మరో నోటీసు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!

Written By Siddhu Manchikanti | Updated: June 29, 2019 17:53 IST
చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు, మరో నోటీసు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!

చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు, మరో నోటీసు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన జగన్... చంద్రబాబు చేసిన దానికి మూల్యం చెల్లించుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్రమంగా కట్టిన ప్రజావేదిక కూల్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా.. కృష్ణానది కరకట్టపై అక్రమం నిర్మించిన భవనాల యజమానులు అందరికి నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్దం అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న అక్రమ కట్టడం యజమాని లింగమనేని రమేష్ తో సహా ఆయన వ్యక్తులకు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు రాజధాని సంస్థ నోటీసులు సిద్దం చేసిందని, ఏ క్షణం అయినా వాటిని వారికి అంద చేయవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ప్రజా వేదికను కూల్చేసిన ప్రభుత్వం మిగిలినవాటిపై కూడా దృష్టి సారించబోతోంది. అంతే కాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలపై ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు దాని పై చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు ఉండబోతున్నట్లు సమాచారం.
Top