పార్టీని బలోపేతం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!

Written By Siddhu Manchikanti | Updated: June 30, 2019 10:45 IST
పార్టీని బలోపేతం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!

పార్టీని బలోపేతం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగుదేశం పార్టీ త్రుటిలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే స్థాయికి దిగజారిపోయింది. దీంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గెలిచిన నాయకులు పార్టీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదని ఇతర పార్టీల వైపు చూస్తున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకనుండి వారంలో ఐదు రోజుల పాటు పార్టీ శ్రేణులందరికి అందుబాటులో ఉండాలని, జులై 1 సోమవారం నుంచి గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం. అందుకు గాను గుంటూరు పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేసుకున్నారు కూడా… అయితే గుంటూరు అరండల్‌పేటలోని పిచుకులగుంటలో సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన జిల్లా కార్యాలయాన్ని గతంలో తాత్కాలికంగా రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. అయితే ఈ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు తో పాటు లోకేష్ కూడా ప్రజలందరికి అందుబాటులో ఉంటారని సమాచారం. అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వలన పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందరికి కాస్త ఊరట కలిగిందని చెప్పాలి.
Top