బాబుకి దగ్గరగా ఉండే సన్నిహితులే మాతో టచ్ లో ఉన్నారు అంటున్న బీజేపీ నేత జీవీఎల్..!

Written By Siddhu Manchikanti | Updated: June 30, 2019 10:46 IST
బాబుకి దగ్గరగా ఉండే సన్నిహితులే మాతో టచ్ లో ఉన్నారు అంటున్న బీజేపీ నేత జీవీఎల్..!

బాబుకి దగ్గరగా ఉండే సన్నిహితులే మాతో టచ్ లో ఉన్నారు అంటున్న బీజేపీ నేత జీవీఎల్..!
 
రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ దారుణమైన స్థితి కి చేరిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు కోల్పోయిన చంద్రబాబు ఆంధ్రాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా పార్టీపై పట్టు కోల్పోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ దుకాణం సర్దుకునే స్థాయికి దిగజారిపోయింది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు కి అత్యంత దగ్గరగా ఉండే స్నేహితులే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లే టీడీపీ పార్టీని విడిచిపెట్టు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ చాటింగ్ కామెంట్లు చేశారు. టిడిపి హయాంలో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టిన అక్రమ కట్టడాల గురించి ప్రస్తావిస్తూ... కరకట్టమీద ఉన్న అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం తమతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అంధకారమయం అన్న జీవీఎల్ జనసేన పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
Top