షాకింగ్ రూల్ తీసుకు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..!

Written By Siddhu Manchikanti | Updated: July 02, 2019 11:02 IST
షాకింగ్ రూల్ తీసుకు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో రెండోసారి బిజెపి అధికారంలోకి బంపర్ మెజార్టీతో రావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ పాలనలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా బహుమతులను స్వీకరించరాదని స్పష్టం చేశారు. అడీషనల్ చీఫ్ సెక్రెటరీ మహేశ్ గుప్తా పేరు మీద అధికారికంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతేకాకుండా అనుమతులు లేకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగీ సచివాలయంలోకి రాకూడదని కఠిన నిబంధనలను జారీ చేశారు. అంతేకాకుండా ముందస్తు అనుమతులు లేకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా బహుమతులను స్వీకరించరాదని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై మూడో తరగతి ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వీట్లు లాంటి చిన్న చిన్నవి ఆఫీసుల్లోనే వస్తాయని, అదే పెద్ద పెద్ద బహుమతులు అధికారుల ఇంటికే వెళ్తాయని తెలిపారు. సీఎం ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నట్లయితే అధికారుల ఇళ్ళను కూడా తనిఖీ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మరొక రూల్ కూడా యోగి ఆదిత్యనాథ్ పాస్ చేశారు. అదేమిటంటే గవర్నమెంట్ కార్యాలయాల్లోకి తుపాకీలు పట్టుకుని ఎవరు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.
Top