చంద్రబాబు కి ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య బాబు, జేసీ బ్రదర్స్..!

Written By Siddhu Manchikanti | Updated: July 02, 2019 11:03 IST
చంద్రబాబు కి ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య బాబు, జేసీ బ్రదర్స్..!

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రతి జిల్లాకు సంబంధించిన టిడిపి నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నేతలతో భేటీ అయిన సమయంలో జిల్లాకు చెందిన జెసి బ్రదర్స్ మరియు బామ్మర్ది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన తొలి సమావేశానికి జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి బికే పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, శమంతకమణి, మేయర్ స్వరూప, మాజీ శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరు కాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జెసి పవన్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇంకా అనేకమంది మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు జేసీ బ్రదర్స్, బాలకృష్ణ కూడా హాజరుకాకపోవడంతో చంద్రబాబు సమావేశంలో అసహనానికి గురయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అనంతపురం జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో బాలకృష్ణ, జెసి బ్రదర్స్ రాకపోవడం చంద్రబాబు కి ఊహించని షాక్ ఇచ్చినట్లయింది.
Top