పార్లమెంటులో వైసీపీ ఎంపీ కి బంపర్ ఆఫర్..!

పార్లమెంటులో వైసీపీ ఎంపీ కి బంపర్ ఆఫర్..!

వైసీపీ పార్టీ తరఫున రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు మిథున్ రెడ్డి. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ కి కుడిభుజంగా ఉంటూ రాయలసీమ పార్టీ వ్యవహారాలను మిథున్ రెడ్డి దగ్గరుండి చూసుకునేవారు. ఈ నేపథ్యంలో జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఏపీ రాయలసీమ రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు రావడం లో కీలక పాత్ర పోషించిన మిథున్‌రెడ్డి కి పార్లమెంటులో బంపర్ ఆఫర్ వచ్చింది. అదేమిటంటే మిథున్ రెడ్డిని లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్ సభ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇకపోతే మిథున్ రెడ్డి 2014 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మాజీకేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధీశ్వరని ఓడించి రికార్డు సృష్టించారు మిథున్ రెడ్డి. 2019 ఎన్నికల్లో మళ్లీ రాజంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. వరుసగా రెండోసారి కూడా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.Top