రసవత్తరంగా ఏపీ ట్విట్టర్ రాజకీయం…!

Written By Siddhu Manchikanti | Updated: July 03, 2019 10:59 IST
రసవత్తరంగా ఏపీ ట్విట్టర్ రాజకీయం…!

రసవత్తరంగా ఏపీ ట్విట్టర్ రాజకీయం…!
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెండు ప్రధాన పార్టీలైన వైసిపి టిడిపి పార్టీ నేతలు ట్విట్టర్ లో రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ముందుగా వైసీపీ పార్టీ కి చెందిన విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నాటినుండి ట్విట్టర్ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఓడిపోయిన తర్వాత మొన్నటివరకు సైలెంటుగా ఉన్న మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయే కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు.
 
దీంతో ఇటీవల వరుసగా ట్విట్ల మీద ట్విట్లతో ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. లోకేష్ గత ఐదేళ్లలో కూడా బోలెడన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లలో ప్రత్యర్థులను విమర్శించారు ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించార - తమ గొప్పలు చెప్పుకున్నారు తమ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్యులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న క్రమంలో ఏపీ లో ఉన్న రాజకీయ నేతలు మొత్తం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రత్యర్థులపై విమర్శలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Top