సొంత పార్టీ నేతల పై సీరియస్ అయినా ప్రధాని మోడీ..!

Written By Siddhu Manchikanti | Updated: July 03, 2019 11:11 IST
సొంత పార్టీ నేతల పై సీరియస్ అయినా ప్రధాని మోడీ..!

సొంత పార్టీ నేతల పై సీరియస్ అయినా ప్రధాని మోడీ..!
 
ఇటీవల జరిగిన దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి పార్టీ స్వచ్ఛందంగా ఎవరి మద్దతు లేకుండా భారీ మెజార్టీ స్థానాలు గెలిచి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడంతో అధికారంలో ఉన్న బిజెపి నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్లమెంటులో అత్యధిక ఎంపీలు కలిగిన వారుగా బిజెపి పార్టీ నేతలు ఉండటంతో...చాలా మంది బీజేపీ ఎంపీలు లోక్ సభకు హాజరు కావడం లేదు.
 
ఇటీవల జరిగిన సమావేశాలలో వరుసగా బీజేపీ ఎంపీలు సరిగ్గా సమావేశాలకు రాకపోవడంతో మోడీకే ఆగ్రహం కలిగినట్టుగా సమాచారం. ఈ విషయంలో ఆయన తన పార్టీ నేతలతో అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి పంపిస్తే సభకు రావడానికి ఏమైంది? అంటూ మోడీ అన్నారట. ఎంపీలు సభకు హాజరు కాకపోవడం తనకు నిరాశకు గురి చేస్తోందని - ఎంపీలంతా వచ్చి వివిధ అంశాలపై చర్చలో పాలుపంచుకోవాలని మోడీ సూచించినట్టుగా సమాచారం.
Top